కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి.. ఓ పథకానికి సంబంధించి అలా నిర్ణయం తీసుకుందో లేదో ఇలా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల బాధను పంచుకునేలా తెరపైకి తెచ్చిన రూపాయికే అంత్యక్రియల స్కీమ్ శభాష్ అనిపించుకుంటోంది. జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నయా స్కీమ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఆకర్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మెచ్చుకున్నారు.
#karimnagar
#municipalcorporation
#venkaiahnaidu
#ktr
#humanity
#telangana